Coconut Pulihora || కొబ్బరి పులిహోర 

ఈ రోజు మనం కొబ్బరి పులిహోర ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.

కావలసినవి:

1. శనగపప్పు – 1 టీ స్పూన్

2. మినప్పప్పు – 1 టీ స్పూన్

3. ఆవాలు – 1 టీ స్పూన్

4. పచ్చిమిర్చి – 3 (నిలువుగా కట్ చేసుకోవాలి)

5. ఎండుమిర్చి – 2 (అడ్డంగా తుంచుకోవాలి)

6. కరివేపాకు – 2 రెమ్మలు

7. ఎండు కొబ్బరి కోరు – 1 కప్పు

8. అన్నం రెండున్నర కప్పుల పైనే (పొడిపొడిగా ఉండాలి)

9. నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

10. ఉప్పు – తగినంత కొద్ది

తయారీ విధానం:

1. ముందుగా ఒక కళాయిలో నూనె వేడి చేసుకుని.

2. వేడి చేసుకున నూనె లో పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి.

3. అలా దోరగా వేయించుకున్న తర్వాత కొబ్బరి కోరు/ తురుము ని జోడించి దోరగా వేయించుకుని అందులో అన్నం వేసుకోవాలి.

4. ఆ అన్నం లో తర్వాత తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి.

Leave a Comment