ఈ రోజు మనం మిక్స్డ్ కూరగాయల తో పప్పు ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.
కావలసినవి:
1. పెసర పప్పు: ముప్పావుకప్పు
2. కంది పప్పు: పావుకప్పు
3. పసుపు: అరచెంచా
4. ఉప్పు: తగినంత
5. క్యారెట్ ముక్కలు: పావుకప్పు
6. బీన్స్: పావుకప్పు
7. బంగాళ దుంప ముక్కలు: పావుకప్పు
8. క్యాలీఫ్లవర్ ముక్కలు: పావుకప్పు
9. పచ్చిబఠాణీ: పావుకప్పు
10. నూనె: రెండు టేబుల్ స్పూన్లు
11. జీలకర్ర: చెంచా
12. వెల్లుల్లి తరుగు: చెంచా
13. అల్లం తరుగు: చెంచా
14. పచ్చిమిర్చి: రెండు
15. టొమాటో ముక్కలు: పావుకప్పు
16. కారం: రెండు చెంచాలు
17. దనియాలపొడి: చెంచా
18. కొత్తిమీర: కట్ట
తయారీ విధానం:
1. పెసరపప్పు, కందిపప్పును కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి.
2. అదేవిధంగా కూరగాయ ముక్కలూ, బఠానీని కలిపి ఉడికించుకోవాలి.
3. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేయించుకుని టొమాటో ముక్కలు వేయాలి.
4. ఆ ముక్కలు మగ్గుతున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు, కారం, దనియాలపొడి వేసి పావు కప్పు నీళ్లు పోయాలి.
5. అయిదు నిమిషాలయ్యాక కూరగాయ ముక్కలు, పప్పు వేసుకుని బాగా కలిపి దింపేముందు కొత్తిమీర వేస్తే చాలు.
అంతే ఎంతో రుచికరమైన మిక్స్డ్ కూరగాయల తో పప్పు రెడీ