ఈ రోజు మనం బెంగాలీ స్పెషల్ అయిన బెంగాలీ ఛోలార్ పప్పు ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.
కావలసినవి:
1. సేనగపప్పు: అరకప్పు
2. పసుపు: అరచెంచా
3. దనియాలపొడి: చెంచా
4. గరంమసాలా: చెంచా
5. ఉప్పు: తగినంత
6. నెయ్యి: రెండు టేబుల్స్పూన్లు
7. జీలకర్ర: చెంచా
8. మెంతులు: పావుచెంచా
9. దాల్చినచెక్క: చిన్న ముక్క
10. యాలకులు: రెండు
11. అల్లం తరుగు: చెంచా
12. చిన్నగా కోసిన కొబ్బరి ముక్కలు: పావుకప్పు
13. ఎండుమిర్చి: రెండు
తయారీవిధానం:
1. కుక్కర్లో కడిగిన సెనగపప్పు, పసుపు వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించు కోవాలి.
2. ఈ పప్పులో దనియాలపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, అల్లంతరుగు వేసి కలిపి స్టవ్ మీద సిమ్ లో పెట్టాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి, మిగిలిన పదార్థాలు వేయించుకుని పప్పులో వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
అంతే గుమగుమలాడే బెంగాలీ ఛోలార్ పప్పు రెడీ