ఈ రోజు మనం పంజాబీ స్పెషల్ అయిన పనీర్ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.
కావలసినవి:
1. పనీర్ తురుము – 1 కప్పు
2. మైదాపిండి – 1 కప్పు
3. పంచదార పొడి – అర కప్పు
4. ఏలకుల పొడి – అర టీ స్పూన్
5. పచ్చి కోవా – కొద్దిగా
6. ఉప్పు – సరిపడా
7. నెయ్యి – 4 టేబుల్ స్పూన్ల పైనే
తయారీ విధానం:
1. ముందుగా మైదాపిండి, తగినంత ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, పంచదార పొడి, పచ్చికోవా, ఏలకుల పొడి వేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు కొద్దికొద్దిగా మైదా మిశ్రమాన్ని తీసుకుని, చిన్న చిన్న అట్లు మాదిరి ఒత్తుకుని మధ్యలో పనీర్ మిశ్రమంతో తయారు చేసుకున్న బాల్స్‌ని ఉంచుకోవాలి.
4. మల్లి ఆ బాల్స్ చుట్టూ మైదా మిశ్రమంతో మళ్లీ బాల్స్ లా చేసుకుని వాటిని అట్లుగా ఒత్తుకోవాలి.
5. ఆ అట్లుని ఒకదాని తర్వాత ఒకటి పెనంపైన నేతిలో వేయిస్తే భలే రుచిగా ఉంటాయి.
అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ బొబ్బట్లు రెడీ