Dal Vada || పప్పు వడ

ఈ రోజు మనం పప్పు వడ ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.

కావలసినవి:

1. బియ్యం: కప్పు

2. సెనగపప్పు: అరకప్పు

3. మినప్పప్పు: అరకప్పు

4. పుల్లని మజ్జిగ: కప్పు

5. పసుపు: అరచెంచా

6. ఉప్పు: తగినంత

7. పచ్చిమిర్చి పేస్టు: రెండు టేబుల్స్పూన్లు

8. వాము: అరచెంచా

9. తెల్ల నువ్వులు: రెండు టేబుల్స్పూన్లు

10. కొత్తిమీర తరుగు: పావుకప్పు

11. వంటసోడా: పావుచెంచా

12. నూనె: వేయించేందుకు సరిపడా

తయారీ విధానం:

1. స్టవ్ మీద కడాయిని పెట్టి బియ్యం, మినప్పప్పు, సెనగపప్పును వేయించుకుని తీసుకోవాలి.

2. వీటి వేడి చల్లారాక మిక్సీలో వేసి పొడిలా చేసుకుని ఓ గిన్నెలో తీసుకోవాలి.

3. ఇందులో మజ్జిగ కలిపి మూత పెట్టి అయిదారు గంటలు నాననివ్వాలి.

4. ఆ తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ కలపాలి.

5. ఈ పిండిని చిన్నచిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేస్తూ, ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

అంతే ఎంతో రుచికరమైన పప్పు వడ రెడీ

Leave a Comment