Punjabi Chicken Achar || పంజాబీ చికెన్ అచార్

ఈ రోజు మనం పంజాబీ స్పెషల్ అయిన పంజాబీ చికెన్ అచార్ ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.

కావలసినవి:

1. చికెన్ ముక్కలు: అరకేజీ

2. ఆవనూనె: రెండు కప్పులు

3. అల్లం- వెల్లుల్లి పేస్ట్: రెండు టేబుల్స్పూన్లు

4. ఉల్లిపాయముద్ద: పావుకప్పు

5. కారం: పావుకప్పు

6. జీలకర్రపొడి: రెండు టేబుల్స్పూన్లు

7. ధనియాలపొడి: రెండు టేబుల్స్పూన్లు

8. వెనిగర్: రెండు టేబుల్స్పన్లు

9. గరంమసాలా: చెంచా

10. నిమ్మరసం: చెంచా

11. కచ్చా పచ్చాగా దంచిన ఎండుమిర్చి పొడి: చెంచా

12. ఉప్పు: తగినంత

తయారీ విధానం:

1. చికెన్ ముక్కలపైన ఎండుమిర్చి పొడి, చెంచా ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి.

2. మిశ్రమం కలిపినా తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి.

3. వేడయ్యాక స్టవ్ ని మీడియంలో పెట్టి చికెన్ ముక్కల్ని వేసి వేయించుకుని తీసుకోవాలి.

4. అదే నూనెలో అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేయించి ఉల్లిపాయముద్ద వేయాలి.

5. నిమిషమయ్యాక కారం, ఇంకొంచెం ఉప్పు, జీలకర్రపొడి, ధనియాలపొడి, చికెన్ ముక్కలు వేసి కలపాలి.

6. తరువాత దింపేముందు గరంమసాలా, వెనిగర్ వేసి ఓసారి కలిపి స్టవ్ ని కట్టేస్తే చాలు.

అంతే గుమగుమలాడే పంజాబీచికెన్అచార్ రెడీ.

Leave a Comment