ఈ రోజు మనం మేథీ మూర్గ్ చికెన్ మసాలా ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.
కావలసినవి:
1. మెంతికూర కట్టలు: మూడు
2. ఎముకల్లేని చికెన్ ముక్కలు: కేజీ
3. ఉల్లిపాయ: ఒకటి పెద్దది
4. టొమాటోలు: రెండు
5. పచ్చిమిర్చి: రెండు
6. వెల్లుల్లి రెబ్బలు: ఆరు
7. అల్లం: చిన్న ముక్క
8. జీలకర్ర: చెంచా
9. కారం: రెండు చెంచాలు
10. పసుపు: అరచెంచా
11. క్రీమ్: అరకప్పు
12. పెరుగు: పావుకప్పు
13. నూనె: పావుకప్పు
14. గరంమసాలా: చెంచా
15. ఉప్పు: తగినంత
తయారీ విధానం:
1. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్రను వేయించుకోవాలి.
2. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి వేయించుకోవాలి.
3. ఇపుడు చికెన్ ముక్కలు, టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
4. తరువాత అయిదు నిమిషాలయ్యాక స్టవ్ ని మీడియంలో పెట్టి గిలకొట్టిన పెరుగు, మెంతికూర పేస్ట్ వేయాలి.
5. తరువాత చికెన్ పూర్తిగా ఉడికాక క్రీమ్ కూడా వేసి బాగా కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు స్టవ్ ని కట్టేయాలి.
అంతే గుమగుమలాడే మేథీ మూర్గ్ చికెన్ మసాలా రెడీ.