Coconut-Coriander Chicken Curry || కొబ్బరి-కొత్తిమీర చికెన్ కూర

ఈ రోజు మనం కొబ్బరి-కొత్తిమీర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం. 

కావలసినవి:

1. చికెన్ ముక్కలు (ఎముకలతో సహా): అరకేజీ

2. నూనె: పావుకప్పు

3. కరివేపాకు రెబ్బలు: రెండు

4. ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు

5. టొమాటోలు: రెండు

6. పసుపు: అరచెంచా

7. ఉప్పు: తగినంత

మసాలాకోసం:

1. మిరియాలు: చెంచా

2. సోంపు: అరచెంచా

3. దనియాలు: చెంచా

4. లవంగాలు: ఆరు

5. దాల్చినచెక్క: చిన్నముక్క

6. మెంతులు: నాలుగైదు గింజలు

7. జీలకర్ర: చెంచా

8. ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు

9. పచ్చిమిర్చి: పది

10. అల్లం: చిన్నముక్క

11. వెల్లుల్లి రెబ్బలు: పది

12. తాజా కొబ్బరితురుము: అరకప్పు

13. కొత్తిమీర తరుగు: అరకప్పు

తయారీ విధానం:

1. ముందుగా మసాలా తయారు చేసుకోవాలి.

2. స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకుని.

3. తరువాత కొబ్బరి తురుము వేసి ఓసారి కలిపి విడిగా పెట్టుకోవాలి.

4. అదే కడాయిలో మిగిలిన మసాలా దినుసుల్ని వేయించుకుని తీసుకోవాలి.

5. ఇప్పుడు వీటన్నింటినీ అరకప్పు నీళ్లతో మిక్సీలో వేసుకుని మెత్తగ పేస్టులా చేసుకోవాలి.

6. తరువాత స్టవ్ మీద  కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, టొమాటో ముక్కలు వేయించుకుని తగినంత ఉప్పు, పసుపు వేయాలి.

7. తరువాత చికెన్ ముక్కలు, చేసిపెట్టుకున్న మసాలా వేసి, కప్పు నీళ్లు పోసి మూత పెట్టి కూర దగ్గరకు అవుతున్నప్పుడు స్టవ్ ని కట్టేస్తే చాలు.

అంతే గుమగుమలాడే కొబ్బరి-కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ.

Leave a Comment